హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70వ ఇంటర్ స్కూల్ గేమ్స్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి ఆయన ఈ పోటీలను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తోందని మహేశ్ గౌడ్ అన్నారు. ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. నేటి చిన్నారులను భవిష్యత్ ఒలింపిక్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
