ఎంపీహెచ్‌‌‌‌ఏ (ఫీమేల్) ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

ఎంపీహెచ్‌‌‌‌ఏ (ఫీమేల్) ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల
  • సెప్టెంబర్16 నుంచి సర్టిఫికెట్‌‌‌‌ వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియలో రెండో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌‌‌‌ను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు హైదరాబాద్‌‌‌‌ వెంగళరావునగర్‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.