గౌరవెల్లి నిర్వాసితులకు గుడ్ న్యూస్ : పరిహారం కింద రూ.7.20 కోట్ల చెక్కులు పంపిణీ

గౌరవెల్లి నిర్వాసితులకు గుడ్ న్యూస్ :  పరిహారం కింద  రూ.7.20 కోట్ల చెక్కులు పంపిణీ

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్​ భూసేకరణ కోసం సర్కారు రూ.250 కోట్ల నిధులను రిలీజ్  చేసింది. నిధులు విడుదల కావడంతో అధికారులు నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేశారు. మంగళవారం హుస్నాబాద్  ఆర్డీవో రామ్మూర్తి 76 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి 190 మంది రైతులకు రూ.7.20 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు రానుండడంతో అధికారులు పనులు
 స్పీడప్​ చేశారు.