మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మైనారిటీల సంక్షేమానికి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మేడ్చల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, అరికెపూడి గాంధీతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు.
తుర్క కాశీ ముస్లిం వర్గానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు రూ.60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. హజ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ముజుబుద్దీన్, మైనారిటీ ఫైనాన్స్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు.
