ఏసీబీకి చిక్కిన టోలిచౌకి ఎస్సై..కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్

ఏసీబీకి చిక్కిన టోలిచౌకి ఎస్సై..కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్

మెహిదీపట్నం, వెలుగు: రూ.10 వేలు లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.పాండు నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీబీకి చిక్కాడు. మంగళవారం సిటీ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. కుమారుడిపై తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా కుటుంబ సభ్యుల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు, ఫిర్యాదుదారుడి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం తీసుకుంటుండగా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.