మిర్యాలగూడలో ఈ నెల 3న కేటీఆర్‌ బహిరంగ సభ.. మీటింగ్కు అనుమతి.. ర్యాలీకి నో పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మిర్యాలగూడలో ఈ నెల 3న కేటీఆర్‌ బహిరంగ సభ.. మీటింగ్కు అనుమతి.. ర్యాలీకి నో పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • బహిరంగ సభకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • తొలుత ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులు, శాంతిభద్రతల సమస్యతో ..
  • పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వని పోలీసులు
  • సభా స్థలం మార్పుతో పర్మిషన్ ఓకే 

​ ​నల్గొండ, వెలుగు: కృష్ణా జలాల సాధన, రైతు సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 3న మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు బహిరంగ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అయితే అంతకుముందు నిర్వహించ తలపెట్టిన రైతు ర్యాలీకి పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. ఈ రెండు కార్యక్రమాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరుకావాల్సి ఉంది. కాగా ఈ కార్యక్రమానికి మొదట పోలీసుల నుంచి పర్మిషన్ లభించలేదు. ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చడంతో బహిరంగ సభకు మాత్రమే పోలీసులకు అనుమతించారు. 

సభకు పర్మిషన్ ఓకే

​కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్ వరకు భారీ రైతు ర్యాలీ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. పట్టణంలో ప్రధాన రహదారులపై ర్యాలీ, రాజీవ్ చౌక్ వద్ద సభతో ట్రాఫిక్ ఇబ్బందులు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అనుమతి నిరాకరించారు.

 ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నిరసనను అణచివేయాలని చూస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఎస్పీ శరత్ చంద్ర పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి మరోసారి అప్లికేషన్ పెట్టుకున్నారు. దీంతో ఎస్పీ సభకు మాత్రమే అనుమతి ఇవ్వగా ర్యాలీని శాంతిభద్రతల దృష్ట్యా నిరాకరించారు. కాగా ఈనెల 3న స్థానిక ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్పీ క్యాంపు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మధ్యాహ్నం 3 గంటలకు రైతు ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.