గంధమల్ల రిజర్వాయర్ పరిహారం గందరగోళం..ఆఫీసర్ల నిర్లక్ష్యంపై విమర్శలు

గంధమల్ల రిజర్వాయర్ పరిహారం గందరగోళం..ఆఫీసర్ల నిర్లక్ష్యంపై విమర్శలు

యాదాద్రి, వెలుగు: గంధమల్ల రిజర్వాయర్​ నిర్వాసితుల పరిహారం చెక్కుల పంపిణీలో ఆఫీసర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. రిజర్వాయర్​లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఇటీవల పరిహారం రిలీజ్​ చేసింది. 352 ఎకరాలకు సంబంధించిన రైతులకు రూ.88.84 కోట్ల చెక్కులు రెడీ చేశారు. 

ఈ చెక్కులను గత నెల27న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల  అయిలయ్య అందించారు. అయితే ఈ చెక్కులపై 2027 ఆగస్టు 27 తేదీ ఉండడంతో బ్యాంకర్లు అభ్యంతరం చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు పాత చెక్కులు తీసుకొని, కొత్త చెక్కులు ఇస్తామని నిర్వాసితులకు సమాచారం అందించారు. కాగా, ఇప్పటివరకు నిర్వాసితుల అకౌంట్లలో రూ. 37 కోట్లు జమ అయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నారు.