సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ సుల్తానియా, ..సెప్టెంబర్ 7న విచారణకు హాజరుకావాల్సిందే: హైకోర్టు

సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ సుల్తానియా,  ..సెప్టెంబర్ 7న విచారణకు హాజరుకావాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: భూసేకరణ పరిహారంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ సుల్తానియా, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ముఖ్యకార్యదర్శి వికాస్‌‌‌‌రాజ్‌‌‌‌లకు హైకోర్టు బెయిలబుల్‌‌‌‌ వారెంట్లు జారీ చేసింది. ఈనెల 7న అధికారులు విచారణకు హాజరయ్యేలా బెయిలబుల్‌‌‌‌ వారెంట్లు జారీ చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.గద్వాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి తదితరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌ను జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌.వి.శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌ విచారించారు.

కింది కోర్టు నిర్ణయించిన పరిహారంలో 50 శాతాన్ని 3 నెలల్లో డిపాజిట్ చేయాలన్న గత ఆదేశాలను అధికారులు విస్మరించారు. దాంతో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఫారం-1 నోటీసులు జారీ చేసినా ఇద్దరూ గైర్హాజరయ్యారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు 7న అధికారులు విచారణకు హాజరయ్యేలా బెయిలబుల్‌‌‌‌ వారెంట్లు జారీ చేసింది.