డీఎస్పీ భీంరెడ్డికి బెయిల్

డీఎస్పీ భీంరెడ్డికి బెయిల్

హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డికి బెయిల్ మంజూరైంది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు, రెండు ష్యురిటీలతోపాటు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నివాసం ఉండే ఇంటి చిరునామాను కోర్టుకు అందించాలని తెలిపింది.

దేశం విడిచి వెళ్లకూడదని, పాస్ పోర్టు సమర్పించాలని ఆదేశించింది. కేసు దర్యాప్తుకు అవసరమైన సమయంలో సహకరించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ష్యురిటీలు సమర్పించిన అనంతరం మంగళవారం రాత్రి 7 గంటలకు డీఎస్పీ భీంరెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా, ఈ కేసులో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయిన భీంరెడ్డి..57 రోజులుగా చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.