రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేయాలి : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు

రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేయాలి :  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు

మహబూబాబాద్/ ​మధిర/ భూపాలపల్లి రూరల్/ ​కాశీబుగ్గ/ వైరా, వెలుగు: లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. మహబూబాబాద్, వరంగల్, వైరా, మధిర, భూపాలపల్లి ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని ప్రశ్నించినందుకే రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీపై కేసులు నమోదు చేయడం కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లతో అణచివేయడం సరికాదన్నారు. రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీపై కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, మాలోత్ రాందాస్ నాయక్‌‌‌‌‌‌‌‌, వరంగల్​ డీసీసీ ప్రెసిడెంట్​ అయూబ్​తో పాటు పలువురు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.