జనగామ: గుడిసెల్లో ఉన్నోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ: గుడిసెల్లో ఉన్నోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ (తరిగొప్పుల), వెలుగు : పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రయార్టీ ఇస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తరిగొప్పుల మండలం అక్కిరాజుపల్లిలో ఆయన పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. 

రెండో విడతలో మంజూరయ్యే 2000 ఇండ్లలో 500 ఇండ్లు గుడిసెల్లో ఉంటున్న వారికే ఇస్తామన్నారు. గతంలో ఇండ్లు మంజూరై అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రూ.22 లక్షలతో నిర్మిస్తున్న అంగన్​వాడీ, వీవో బిల్డింగ్​ నిర్మాణాలు మూడు నెలల్లో కంప్లీట్ చేయాలన్నారు.