- నిందితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు
- గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు
- బాధితుడి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
- నిందితుడు ఆర్ట్ డైరెక్టర్ఆనంద్సాయి కొడుకు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని.. ఓ విద్యార్థి ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో మరో కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొదట గాయపడిన వ్యక్తి మృతి చెందగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన విద్యార్థి గాయపడ్డాడు. ఈ కేసులో ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు డైరెక్టర్ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున హిట్ అండ్ రన్ జరిగింది. రోడ్డు దాటుతున్న ఒకరిని కారు ఢీకొట్టగా.. గాయపడిన వ్యక్తిని రోడ్డుకు మరోవైపు ఉన్న హాస్పిటల్‌కు కాళ్లు, చేతులు పట్టుకొని దాటిస్తుండగా సందీప్ కారు ఓవర్‌స్పీడ్‌తో వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో అంతకుముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మరణించగా, మరో క్యాబ్డ్రైవర్తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగాక ఆగి సాయం చేయాల్సిన సదరు నిందితుడు కారుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
మృతుడు హోటల్‌లో హెల్పర్
బిహార్‌కు చెందిన నంద్‌కిశోర్ కుమార్ రే (31) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గచ్చిబౌలిలోని షాగౌస్ హోటల్‌లో వంట పని హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఖాజాగూడ రోటరీ వద్ద రోడ్డు దాటుతుండగా ఔటర్ రింగురోడ్డు నుంచి ఖాజాగూడ వైపు వస్తున్న ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందకిశోర్ గాయపడ్డాడు. దీంతో ఇన్నోవా డ్రైవర్ జైద్ ఖాద్రీ(21), మరో క్యాబ్ డ్రైవర్ అమీర్‌తో కలిసి రోడ్డుకు అవతలి వైపు ఉన్న ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించేందుకు నందకిశోర్ కాళ్లు చేతులు పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. ఈ టైంలో ఖాజాగూడ నుంచి ఔటర్ రింగురోడ్డు వైపు ఓవర్‌స్పీడ్‌తో వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పటికే గాయపడ్డ నందకిశోర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోగా, ఇన్నోవా కారు డ్రైవర్ జైదీ ఖాద్రీకి గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత వీరిని ఢీకొట్టిన ప్రముఖ ఆర్ట్డైరెక్టర్ఆనంద్సాయి కొడుకు సందీప్ఆనంద్కారుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత వెనకాలే వచ్చిన మరో కారు కూడా రోడ్డుపై పడినవారిని గమనించకుండా మీది నుంచి వెళ్లినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న రాయుదర్గం పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా.
హిట్ అండ్ రన్ చేసి పారిపోయింది మహీంద్రా కారు అని తెలుసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన టైం ఆధారంగా వెనక, ముందు ఏరియాల్లో ఉండే సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అందులో కారు నంబర్ ఆధారంగా ఆ కారు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు సందీప్ ఆనంద్ నడిపినట్టు గుర్తించారు. గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్న సందీప్ ఆనంద్ ఓవర్‌స్పీడ్‌తో నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణాలు పోవడానికి, మరొకరు గాయపడడానికి కారణమయ్యారని తేల్చారు. నిందితుడిని అ
రెస్టు చేశారు.
