ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌తో ఎంగేజ్‌‌ చేసే రోమాంచకం: నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా

ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌తో ఎంగేజ్‌‌ చేసే రోమాంచకం: నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన చిత్రం ‘రోమాంచకం’.  సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు.  వేణుగోపాల్ రెడ్డి దర్శకుడు.  ఈనెల 3న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రణయ్ రెడ్డి చిత్ర విశేషాలను గురించి ఇలా వివరించారు.  

‘‘అర్జున్ రెడ్డి, యానిమల్, ఇప్పుడు ‘స్పిరిట్‌‌’కు ప్రొడ్యూసర్స్‌‌ అయినప్పటికీ మా ప్రొడక్షన్‌‌లో వరుస సినిమాలు చేయాలనే మైండ్‌‌ సెట్‌‌లో మేం లేము. అయితే 
వేణుగోపాల్‌‌ రెడ్డి చెప్పిన స్టోరీలోని హ్యూమర్‌‌‌‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌,  ఫ్రెండ్స్ మధ్యలో జరిగే సరదా సీన్స్ నచ్చి టేకప్‌‌ చేశాం. మొదట ఓ సీన్‌‌ ఇచ్చి చేసుకురమ్మన్నాం.  ఆ సీన్‌‌ ఔట్‌‌పుట్‌‌ చూశాక నమ్మకం కలిగింది.  ఇది క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్‌‌‌‌ చుట్టూ జరిగే కథ. ఇంజినీరింగ్ పూర్తి చేశాక అతను ఏం చేస్తాడు, అతని లైఫ్‌‌లో ఏం జరిగింది, తన లవ్‌‌స్టోరీ, వాళ్ల ఫ్రెండ్స్ మధ్య ఉన్న కన్ఫ్యూజన్స్ లాంటి అంశాలతో ఆద్యంతం ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటుంది.  ఎక్కడా బోర్‌‌‌‌ కొట్టించకుండా జోవియల్‌‌గా ఉంటుంది.

మా గత చిత్రాల్లాగే దీనికి చక్కని సంగీతం కుదిరింది.  వాసుకి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సెన్సార్ నుంచి యు/ ఎ వచ్చింది. యూత్, ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య కామెడీని దర్శకుడు వేణుగోపాల్‌‌ చాలా బాగా క్యాప్చర్‌‌‌‌ చేశారు. ఆర్గానిక్‌‌ కామెడీ ఉంటుంది తప్ప ఎక్కడా ఫోర్స్‌‌ఫుల్‌‌గా ఉండదు. నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌‌ అంతా ప్యాషనేట్‌‌గా వర్క్ చేశారు. హైదరాబాద్, చెన్నైలో షూటింగ్ చేశాం. ఈ సినిమా మేకింగ్‌‌లో సందీప్‌‌ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. తను ‘స్పిరిట్‌‌’ పనుల్లో ఉన్నాడు. సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కట్ చూసి హ్యాపీ ఫీలయ్యాడు. ఇటీవల రెండు కథలు విన్నాం. అవి ఇంకా పేపర్ మీదనే ఉన్నాయి. ప్రస్తుతం మా ఫోకస్ అంతా ‘స్పిరిట్’ మీదే ఉంది. ఇప్పటికే నలభై శాతం పూర్తయింది.  ప్రభాస్ గారు 40 డేస్‌‌ వర్క్ చేశారు. అది పూర్తయ్యాకే కొత్త సినిమాల గురించి ఆలోచిస్తాం’’.