పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్, వరంగల్, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో బైక్‌లు చోరీ చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠా ప్రధాన సూత్రధారిని బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బేగంపేట పీఎస్‌లో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సీఐ సైదులు మంగళవారం వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన సప్పిడి రాజ్‌కుమార్(50), మరో ఇద్దరు కలిసి టూవీలర్లను చోరీ చేసి ఇతర జిల్లాల్లో తక్కువ ధరకు అమ్మి జల్సాలు చేస్తున్నారు.
బాధితుల ఫిర్యాదులతో పోలీసులు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 14 బైకులను రికవరీ చేశారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ పేర్కొన్నారు.
