హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ పాలనా దశాబ్దపు దగా, వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో ‘‘అబద్ధాలు.. వాస్తవాలు” ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల ప్రజా పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వివిధ ఫొటోలు, పోస్టర్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన పార్టీ నాయకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
