మాలల తరఫున ఎమ్మెల్యేలు గళమెత్తాలి.. జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలి

మాలల తరఫున ఎమ్మెల్యేలు గళమెత్తాలి.. జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలి
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

సైఫాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ కారణంగా నష్టపోతున్న మాలలకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గళమెత్తాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లను సవరించాల్సిన అవసరంపై మాల వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన కోరారు. 

మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్ఫూర్తి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు దక్కినప్పటికీ, రోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో లోపాల వల్ల మాలలకు రావాల్సిన రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. 

మాలలకు న్యాయం జరిగేలా రోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లను సవరించాలని చెన్నయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యేలు వేదికగా చేసుకుని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. వర్గీకరణ అమలులో మాలలకు అన్యాయం జరిగితే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.