- రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రామంతపూర్‌లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జల్లపల్లి అంజి ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, దాదాపు రూ.8 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నిధులు విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
బహిరంగ సభల్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆచరణలో ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
