కాంగ్రెస్ ‘ప్రజా పాలన’ వెయ్యి రోజుల సంబురాలకు పీసీసీ పిలుపు

కాంగ్రెస్ ‘ప్రజా పాలన’ వెయ్యి రోజుల సంబురాలకు పీసీసీ పిలుపు
  • 3న మండల కేంద్రాలు, 4, 5 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో వేడుకలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘ప్రజా పాలన’ వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 3న మండల కేంద్రాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని..  4, 5 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో వేడుకలు జరపాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మహేశ్ గౌడ్ సూచించారు.=