గూడెం వద్ద గోదావరి పుష్కర ఘాట్ పనులకు భూమిపూజ

గూడెం వద్ద గోదావరి పుష్కర ఘాట్ పనులకు భూమిపూజ


దండేపల్లి, వెలుగు: గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద రూ.9 కోట్ల ఎండోమెంట్ ఫండ్స్​తో చేపట్టే పుష్కర ఘాట్ పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంగళవారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడెం గోదావరి పుష్కరఘాట్‌‌‌‌‌‌‌‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.