హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది.ఈ ప్రమాదంలో మార్కెట్‌లోని పలు షెడ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణాల్లో ఉన్న వివిధ రకాల సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
