- నేటి నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ హెల్త్ వర్సిటీ మళ్లీ పునరుద్ధరించింది. విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. నీట్ యూజీలో నిర్ణీత కటాఫ్ స్కోర్ సాధించి అర్హత పొందిన అభ్యర్థులు https://tspvtmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇతర పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆగస్టు12 నాటి నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌ను పరిశీలించాలని సూచించారు
