వ్యవసాయానికి గనుల వ్యర్థాలు.. ఐకార్తో ఆర్సెలార్ మిట్టల్ ఒప్పందం

వ్యవసాయానికి గనుల వ్యర్థాలు.. ఐకార్తో ఆర్సెలార్ మిట్టల్ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: గనుల వ్యర్థాలను పంటల ఎదుగుదలకు ఉపయోగించేలా చేయడానికి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (ఐకార్–-ఐఏఆర్‌‌‌‌‌‌‌‌ఐ)తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇనుప ఖనిజాల తవ్వకాల్లో వచ్చే వ్యర్థాలలో సిలికా, కాల్షియం, మెగ్నీషియంను పంటల సాగుకు, నేలసార వృద్ధికి ఉపయోగించడానికి ఇవి కలిసి పనిచేస్తాయి. 

గతంలో నిర్వహించిన ప్రాథమిక ప్రయోగాల ఫలితాలు బాగున్నాయని సంస్థ అధికారులు తెలిపారు. వరి, గోధుమ ఇతర కూరగాయల సాగులో ఈ వ్యర్థాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై దీర్ఘకాలిక శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహిస్తామని తెలిపారు.