Rohit Sharma Retirement: 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు (గురువారం) జరగనున్న బీసీసీఐ సమీక్షా సమావేశంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల భవిష్యత్తుపై చర్చించనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, జడేజాలపై పెద్దగా ఒత్తిడి లేనప్పటికీ, రోహిత్ విషయంలో మాత్రం బీసీసీఐ ప్రత్యేకంగా సమీక్షించనుంది. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ కాకుండా మరో సభ్యుడు రోహిత్‌తో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, రోహిత్ ఫ్యూచర్ రోడ్‌మ్యాప్‌పై ఈ మీటింగ్ లోనే క్లారిటీ రానుంది.
లార్డ్స్ సెంచరీతో రిటైర్మెంట్ పుకార్లకు చెక్:
జులై 19న లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ 138 పరుగుల అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ మైండ్ బ్లాకింగ్ నాక్‌తో రిటైర్మెంట్ రూమర్లకు ఒక్కసారిగా చెక్ పడింది. లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ అని సోషల్ మీడియాలో ప్రచారం సాగగా, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. రోహిత్ శర్మ జట్టు ప్రణాళికల్లో ఉన్నంత వరకు భారత జట్టు తరఫున కొనసాగుతాడని స్పష్టం చేశారు.
అవన్నీ కేవలం ప్రచారమే: రోహిత్ శర్మ
తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. అవన్నీ కేవలం ప్రచారమే (Noise) అని కొట్టిపారేశాడు. మైదానంలోకి దిగడం, బ్యాట్‌తో పరుగులు సాధించి నా దేశానికి, జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే నా పని.. అరంగేట్రం చేసినప్పటి నుంచి నాకు అదే చెప్పారు, దాన్నే కొనసాగిస్తాను.. నేను క్రికెట్లో ఉన్నంత కాలం ఇలాంటి ప్రచారాలు వస్తూనే ఉంటాయి. వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను.. మైదానంలో నా ప్రదర్శన ద్వారా జట్టు విజయాల్లో భాగస్వామిని కావడమే నాకు ముఖ్యం అని హిట్‌మ్యాన్ తేల్చిచెప్పాడు.
🔴ROHIT SHARMA WAS ANGRY AFTER SELECTORS’ RETIREMENT CALL🤯
— Sam (@cricsam02) September 3, 2026
🎙️: According to a PTI report, Rohit Sharma was reportedly informed by a member of the selection committee that the selectors had decided to move on from him.
Rohit was said to be angry, & there was even buzz that he… pic.twitter.com/OKIr7ZmDnz
