ఇందిరమ్మ ఇండ్ల గురించే ఎక్కువ దరఖాస్తులు ..గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న షబ్బీర్ అలీ

ఇందిరమ్మ ఇండ్ల గురించే ఎక్కువ దరఖాస్తులు ..గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న షబ్బీర్ అలీ

హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల గురించే ప్రజల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. బుధవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో 78 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.