ఫీజు బకాయిలపై సెప్టెంబర్ 7న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా

ఫీజు బకాయిలపై సెప్టెంబర్ 7న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా
  • పోస్టర్ విడుదల చేసిన పార్టీ నేతలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఈ నెల7న  బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థి మహాధర్నా నిర్వహించనున్నది. ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ నేతలు రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈనెల 7న జరిగే ధర్నాకు పార్టీ స్టేట్​ చీఫ్​ రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు అధ్యక్షత వహించనున్నారని, చీఫ్ గెస్టులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏలేటి మహేశ్వర రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు.