ఐసీసీ ర్యాంకింగ్స్లో గిల్‌‌.. రెండు స్థానాలు కిందకు

 ఐసీసీ ర్యాంకింగ్స్లో గిల్‌‌.. రెండు స్థానాలు కిందకు

దుబాయ్‌: ఇండియా టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కిందకు దిగజారాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌ (709) తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే ర్యాంక్‌ దిగజారడానికి ప్రధాన కారణం.

వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (713) ఏడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇండియా తరఫున ఇతనిదే టాప్‌ ర్యాంక్‌. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (697) 11వ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. లంక టూర్‌లో రెండు సెంచరీలతో 328 రన్స్‌ చేసిన ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ ఐదు ప్లేస్‌లు ఎగబాకి 54వ ర్యాంక్‌లో నిలిచాడు.

బౌలింగ్‌లో పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (853) ఒక స్థానం కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా లంక సిరీస్‌కు దూరంగా ఉండటం బుమ్రా ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది.