జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజున కీలక గ్రహాల వారు స్వామిని ఎలా పూజించాలి. ఆ రోజున, చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటే, గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. దీనివల్ల హంస రాజయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా సూర్యుడు తన స్వంత రాశి అయిన సింహరాశిలో, శుక్రుడు తన స్వంత రాశి అయిన తులారాశిలో ఉండటం వల్ల మాలవ్య రాజయోగం ఫలిస్తుంది. వీటి ప్రభావం వలన కృష్ణాష్టమి రోజున ఏ రాశి వారు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మేష రాశిః ఈ రాశికి అధిపతి కుజుడు.. గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి. కచ్చితంగా, నుదుట మ పెట్టుకుని పూజ చేయాలి. శ్రీ కృష్ణపరమాత్మకు దానిమ్మ పండ్లు, ఎర్ర ఆపిల్, పిండి వంటలు నైవేద్యంగా సమర్నించాలి,
వృషభ రాశిః ఈ రాశికి అధిపతి శుక్రుడు,, కృష్ణాష్టమి రోజు బాల గోపాలుడిని పూజించాలి. స్వామివారికి చందనం సమర్పించాలి. తేనెతో తయారు చేసిన పదార్ధాలు, వెన్నతో తయారు చేసిన పదార్దాలు పరమాత్మకు సమర్పించాలి.
మిథున రాశిః ఈ రాశివారు కృష్ణాష్టమి రోజున రాధకృష్ణులను పూజించాలి, ఓంనమోభగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపం చేయాలి. ఆ తరువాత స్వామికి ఆకు పచ్చ పండ్లను, పాలకోవాను సమర్పించాలి,
కర్కాటక రాశి: కృష్ణాష్టమి రోజున గురుడు ఇదే రాశిలో శుభ దృష్టితో ఉన్నాడు, ఈ రాశికి చెందిన వారు మానసిక ప్రశాంతతకు, కుటుంబంలో సంతోషం కోసం సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్దలతో పూజించాలి. స్వామికి పాలతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి,గోమాతకు గోధుమలు, బెల్లం ఆహారంగా ఇవ్వాలి.
సింహ రాశిః ఈ రాశికి అధిపతి సూర్యుడు..కృష్ణాష్టమి రోజున సూర్యుడు ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్దలతో ఎర్ర పూలతో పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. బెల్లం లడ్డూలు, వెన్నతో తయారు చేసిన పదార్దాలను స్వామికి సమర్పించడం వలన పెండింగ్ పనులు పూర్తవుతా యని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి : కృష్ణాష్టమి రోజు ఈ రాశి వారు కృష్ణపరమాత్ముడికి తులసిమాలను సమర్పించాలి. అలాగే భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పఠించాలి. స్వామి వారికి అటుకులు.. బెల్లం సమర్పించాలి.
తులా రాశిః ఈ రాశికిఅధిపతి శుక్రుడు..కృష్ణాష్టమి రోజున శుక్రుడు ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. బాలగోపాలుడిని ఊయలలో ఉంచి పూజించాలి. స్వామికి వెన్న.. పెరుగు సమర్పించాలి.
►ALSO READ | ఏ రూపంలో ఉండే చిన్ని కృష్ణుడికి ఎలాంటి పూజలు చేయాలి.. ఒక్కో రూపానికి ఉన్న విశిష్ఠత తెలుసుకుందామా..!
వృశ్చిక రాశి : ఈ రాశి వారు రాధాకృష్ణులను పూజించాలి. వాసుదేవుడిని పంచామృతాలతో అభిషేకం చేయాలి. పరమాత్ముడికి పాలు, పెరుగు, వెన్న, తేనె పంచదార సమర్పించాలి.
ధనుస్సు రాశిః ఈ రాశి వారు చిన్ని కృష్ణుడిని పూజించాలి. పిల్లలకు భాగవతం గురించి వివరించాలి. జగన్నాథుడిని పూజించి అరటి పండ్లు, పసుపు లడ్డూ నైవేద్యంగా సమర్పించి.. పిల్లలకు పంపిపెట్టాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి : ఈ రాశి వారు హరే రామ.. హరే రామ .. రామ రామ ..హరే..హరే.. హరే కృష్ణ..హరే కృష్ణ హరే హరే అనే మంత్రాన్ని పఠించాలి. స్వామిని పసుపు.. కుంకుమ.. తులసిదళాలతో పూజించాలి. నైవేద్యంగా నువ్వుల లడ్డు,కొబ్బరి మిఠాయి, పాలు, వెన్న సమర్పించాలి. ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా జాగారం చేయాలి.
కుంభ రాశి: ఈ రాశి వారు కృష్ణపరమాత్మను కృష్టాష్టమి రోజున... గంగా జలంతో అభిషేకం చేసి షోడశ ఉపచారాలతో పూజించాలి.నీలం రంగు పూలు సమర్పించాలి. నెమలి పింఛంతో అలంకారం చేయాలి. అనంతరం తేనె పాలను నైవేద్యంగా సమర్పించాలి.
మీన రాశిః ఈ రాశి వారు నంద గోపాలుడిని పూజించాలి. గోమాతను కూడా పూజించాలి. తరువాత ప్రదక్షిణాలు చేయాలి. కృష్ణుడికి తులసి మాలను సమర్పించాలి.గోమాతకు తోటకూర, పచ్చిగ్రాసాన్ని ఆహారంగా ఇవ్వాలి. స్వామికి పాలకోవా.. అటుకులు, బెల్లం సమర్పించాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
