CM బ్లాక్ మెయిల్ చేసి నన్ను తొలగించాడు: కొండా సురేఖ

CM బ్లాక్ మెయిల్ చేసి నన్ను తొలగించాడు: కొండా సురేఖ

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేయడాన్ని కొండా సురేఖ ఖండించారు. హై కమాండ్కు తనను తొలగించే ఆలోచన లేదని, సీఎం పట్టుబట్టి తనను తొలగించారని ఆమె ఆరోపించారు.

సీఎం బ్లాక్ మెయిల్ చేసి తనను తొలగించాడని కొండా సురేఖ తీవ్ర ఆరోపణ చేశారు.‘ఆమెను తొలగిస్తారా..? నన్ను వెళ్లిపోమంటారా ?’ అని అధిష్టానాన్ని సీఎం బ్లాక్ మెయిల్ చేశారని కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. ఈ కుట్ర వెనుక వేంనరేందర్, పొంగులేటి, కొండల్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు.

మంత్రి వర్గం నుంచి తీసేసేటప్పుడు తనను అడగొద్దా అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా తనను బర్తరఫ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ఏదో అంటే.. తనపై కక్ష సాధించారని ఆమె వాపోయారు. 50 కోట్లు  ఇచ్చి పీసీసీ కొన్నాడని విమర్శించన వాళ్లనే వెనకేసుకొస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

►ALSO READ | బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ఫస్ట్ రియాక్షన్ ఇదే

మల్లు రవి కూడా గతంలో కాంగ్రెస్ను తిట్టిన వాడేనని ఆమె చెప్పారు. ప్రజా బలం ఉన్న నాయకులం అని, మంత్రి పదవి పోతే బాధపడే మనస్తత్వం కాదని కొండా సురేఖ చెప్పారు. కారణం చెప్పకుండా తీసేయడమే తనకు బాధ కలిగించిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.