మంత్రిగా బర్తరఫ్ చేసిన తర్వాత మీడియా ఎదుట తన వాదన వినిపించారు కొండా సురేఖ. మంత్రిగా తొలగించటం వెనక కారణాలు వెల్లడిస్తూనే.. మంత్రిగా తొలగించినంత మాత్రాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారామె. ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేస్తూ.. రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించారు కొండా సురేఖ.
కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని.. పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు కొండా సురేఖ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. మధ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా.. తిరిగి మళ్లీ సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వచ్చినట్లు వివరించారు కొండా సురేఖ. ఇప్పటికి అయితే పార్టీ మారే ఆలోచన లేదని మీడియా ఎదుట స్పష్టం చేశారామె.
►ALSO READ | CM బ్లాక్ మెయిల్ చేసి నన్ను తొలగించాడు: కొండా సురేఖ
మంత్రిగా రాజీనామా చేయమని అధిష్టానం పెద్దలు నాకు చెప్పలేదని.. ఎవరూ ఆదేశించలేదని వివరించారామె. కొంత మంది ఒత్తిడిలకు లొంగి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ పార్టీలో జరిగే అంతర్గత విషయాలకు వివరించారు మాజీ మంత్రి కొండా సురేఖ.
