మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత... కేటీఆర్ రైతు మహాధర్నాకు పోటీగా కాంగ్రెస్ నిరసన ర్యాలీ..!

మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత... కేటీఆర్ రైతు మహాధర్నాకు పోటీగా కాంగ్రెస్ నిరసన ర్యాలీ..!

మిర్యాలగూడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేటీఆర్ రైతు మహాధర్నాకు పోటీగా కాంగ్రెస్ నిరసన ర్యాలీకి పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పోటీగా  వెయ్యి రోజుల అభివృద్ధి వర్సెస్ పదేళ్ల వైఫల్యాలు పేరుతో బీఆర్ఎస్ ను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఈ క్రమంలో గురువారం ( సెప్టెంబర్ 3 ) స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీసుకు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
  
ఇరువర్గాల పోటాపోటీ నిరసనలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హామీలు ఎక్కడ... ప్రజలకు న్యాయం ఎక్కడ అంటూ ప్లకార్డులతో భారీ ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రోడ్డుపైనే బైఠాయించి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

►ALSO READ | బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ఫస్ట్ రియాక్షన్ ఇదే

పదేళ్ల తమ పాలనలో నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీల ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించారు. మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరుతో మిర్యాలగూడ రాజకీయం మరింత వేడెక్కింది.