రంగు రంగుల టూటీ ఫ్రూటీ అంటే ఇష్టమా..? ఈ వీడియో చూడండి.. జీవితంలో ముట్టుకోరు!

రంగు రంగుల టూటీ ఫ్రూటీ అంటే ఇష్టమా..? ఈ వీడియో చూడండి.. జీవితంలో ముట్టుకోరు!

టూటీ ఫ్రూటీ అంటే పిల్లలతో సహా పెద్దలు కూడా ఎంతగా ఇష్టపడతారో. తియతియ్యగా ఉండే టూటీఫ్రూటీలను కేకులపైన ఫుల్లుగా చల్లుకుని తినటం చాలా మందికి ఇష్టం. కొందరైతే బయట తెచ్చుకుని ఇంట్లో కేక్ తయారు చేసుకుని తింటుంటారు. మరికొందరైతే కేక్ లేకుండానే డైరెక్టుగా అలా లాగించేస్తుంటారు. అయితే వీటి తయారీకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. అది చూస్తే తినాలంటే ఒకసారి ఆలోచిస్తారు. అదేంటో చూడండి.

టూటీ ఫ్రూటీ తయారీ కోసం మామిడి పండ్లను స్టోర్ చేసిన విధానం చూస్తే.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనాల్సిందే. ఎందుకంటే ఆల్కహాల్ తయారీలో కూడా ఇంత ఘోరంగా పులియబెట్టరు. అదేదో ఇటుకలు తయారీ చేసినప్పుడు మట్టిని తొక్కుతారు కదా.. అలా ఉంది పండ్లను వెలికితీస్తున్న వీడియో. 

తొక్కలు, టెంకలు వేరు చేసిన మామిడి పండ్లను పెద్ద పెద్ద బావుల లాంటి గుంతలలో పోశారు. ఆ నీళ్లు వరద నీళ్లలా రంగు మారిపోయి చెత్త చెత్తగా ఉన్నాయి. అందులో ఒంటి మీద కట్ డ్రాయర్ తప్ప ఏమీ లేకుండా పనిచేస్తున్న బాలురు ఉన్నారు. వాళ్లు మామిడి తొక్కలను, టెంకలను ఎత్తుతున్న వీడియో చూస్తే వాక్ అనిపించక మానదు. అక్కడ పనిచేసే వాళ్లయితే కచ్చితంగా టూటీ ఫ్రూటీని జీవితంలో తినరు. ఎందుకంటే వాళ్లకు తెలుసు కదా అవి ఎలా తయారై వస్తున్నాయో. 

ఇండియన్ జర్నలిస్ట్ ఖుష్భూ ఖాన్ షేర్ చేసిన టూటీ ఫ్రూటీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మురికి నీటి గుంతలలో నుంచి ఫ్రూట్స్ ను, వాటి తొక్కలు, టెంకలను తీసి లారీలో లోడ్ చేస్తున్నారు పనివాళ్లు. అక్కడి నుంచి తయారీ కేంద్రానికి తీసుకెళ్లి.. అక్కడ ప్రాసెస్ చేసి రెడ్, గ్రీన్, ఎల్లో.. ఇలా రంగులు అది.. అందంగా ప్యాకేజ్ చేస్తారు. ఈ వీడియో చూశాక జనాల హెల్త్ ను రిస్కులో పెట్టి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ వీడియో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో భాగంగా తీసింది అయినందుకు.. పూర్తి వివరాలు బయటపెట్టలేదు. ఈ ప్రాసెసింగ్ కేంద్రం ఎక్కడ ఉంది.. లొకేషన్ ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ వీడియో చూసినాక.. మనిషి ఆరోగ్యం ఎంత రిస్కులో ఉందో ఒక క్లారిటీ అయితే వస్తుందనే చెప్పాలి.