- పట్టాణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్
- ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలకు శంకుస్థాపన
కుత్బుల్లాపూర్, వెలుగు : వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు విస్త్రృత అవకాశాలు కల్పించే లక్ష్యంతో రౌండ్టేబుల్ఇండియా చేస్తున్న సేవలు అభినందనీయమని మెట్రోపాలిటన్ఏరియా ఆండ్ పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యే క కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ సర్కిల్ డీ పోచంపల్లిలో రౌండ్ టేబుల్ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలకు సోమవారం ఆయన మేడ్చల్ జిల్లా అడిషనల్కలెక్టర్ ఫైజాన్అహ్మద్తో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా జయేశ్‌రంజన్ మాట్లాడుతూ రౌండ్టేబుల్ఇండియా చేపట్టిన పాఠశాల నిర్మాణం ద్వారా వేలాది మంది వెనుకబడిన వర్గాల పిల్లలకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. నిర్ణీత గడువులోగా స్కూల్ నిర్మాణం పూర్తిచేయాలని, ఇందుకోసం తన వంతు సహకారం అందజేస్తామన్నారు.
రౌండ్‌టేబుల్ ఇండియా ఏరియా చైర్మన్ అనిరుధ్ సోంపల్లి మాట్లాడుతూ ఇక్కడి ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన సుమారు ఏడు వేల కుంటుంబాలు నివసిస్తున్నాయని, వారు చదవుకోవడానికి దూరం వెళ్లాల్సి వస్తుందని గుర్తించామాన్నారు. వారందరికి సౌలభ్యంగా ఉండటానికి దగ్గరలో పాఠశాల నిర్మిస్తున్నట్లు చెప్పారు. విశాలమైన గదులతోపాటు లైబ్రరీ, ల్యాబ్స్, అత్యాధునిక సాంకేతికతో చదువు చెప్తామన్నారు. సెక్రటరీ, ట్రేజరర్అభిషేక్అగర్వాల్, వైస్ చైర్మన్బి.లోకేశ్వరెడ్డి, కౌశిక్యక్కల, నిర్మల్ఉప్పుగుండ్ల పాల్గొన్నారు.
