హుక్కా కేఫ్‌‌‌‌పై పోలీసుల దాడి..9 మందిపై కేసు నమోదు

హుక్కా కేఫ్‌‌‌‌పై పోలీసుల దాడి..9 మందిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు : జూబ్లీహిల్స్‌‌‌‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌‌‌‌పోస్ట్ మెట్రో సమీపంలోని రోడ్ నంబర్ 36లో, జూబ్లీ ఫెస్టా ఇన్ హోటల్ భవనం ఐదో అంతస్తు టెర్రస్‌‌‌‌పై దశానన్ రావణ్ కేఫ్‌‌‌‌ నిర్వహిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్స్​చేయగా, 26 మంది వినియోగదారులు హుక్కా సేవిస్తూ దొరికారు. ట్రేడ్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్, ప్రత్యేక స్మోకింగ్ జోన్ లేవని పోలీసులు నిర్ధారించారు.  హుక్కా సెంటర్ లో సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, కేఫ్ యజమాన, బిల్డింగ్​ఓనర్, మేనేజర్, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ ఎస్ఐ ఎ. సందీప్ రెడ్డి తెలిపారు.