ఉప్పల్లో పగిలిన మంచినీటి పైప్లైన్.. మెట్రో పిల్లర్పైకి ఎగజిమ్మిన నీళ్లు

ఉప్పల్లో పగిలిన మంచినీటి పైప్లైన్.. మెట్రో పిల్లర్పైకి ఎగజిమ్మిన నీళ్లు

ఎల్ నినో కరువు కష్టాలలో హైదరాబాద్ గొంతు ఎండుతున్నది.. భూగర్భ జలాలు అడుగంటి పోయి బోర్లు పోస్తలేవు.. డబ్బులు పెట్టి ట్యాంకర్లు తెప్పించుకుందం అంటే చాలా ఫిరం అయిపోయింది. నీళ్లకు ఇంత ఇబ్బందులు ఉంటే..  మంచినీళ్ల పైపు పగలి రోడ్లపై ఏరులై పారుతుంటే గుండె తరుక్కుపోతుంది బాబూ. ఉప్పల్ లో మంచినీళ్ల పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుంటే నగరజీవి మాటలు ఇవి. 

2026 అక్టోబర్ 20న దసరా పండుగ రోజు  ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో మంచినీళ్ల పైప్ లైన పగిలి నీరు వృధాగా పోయింది.  ఓ కారు HMWSSB ప్రధాన మంచినీటి పైప్‌లైన్‌ను ఢీకొట్టడంతో పైప్‌లైన్‌ దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో భారీగా మంచినీరు రోడ్డుపైకి చేరి వృథాగా పోయింది. ఒక పెద్ద ఫౌంటెయిన్ మాదిరిగా నీళ్లు మెట్రో పిల్లర్ దాటి ట్రాక్ పైన అంతకు అంత ఎత్తుకు ఎగజిమ్మాయి. 

పైప్ లైన్ పగిలి పోవటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయ్యో నీళ్లు వృధాగా పోతున్నాయి అంటూ ఆవేదనతో  సంబంధిత అధికారులు ఫోన్ చేసి సమాచారం అందించారు స్థానికులు, రోడ్డుపైన వెళ్తున్న వాహనదారులు. వెంటనే స్పందించిన అధికారులు పైప్‌లైన్‌కు మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టారు.