చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.13.3 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందాయి. ఈ మొత్తంలో 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే వచ్చినట్లు ఆ పార్టీ ఈసీఐకి సమర్పించిన నివేదిక వెల్లడించింది. క్రీడలు, ప్రజాపనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున రూ.8.2 కోట్లు విరాళంగా ఇవ్వగా, మరో మంత్రి ఆర్వీ రంజిత్ కుమార్ రూ.5 కోట్లు అందించారు. మరోవైపు, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు అందిన విరాళాల వివరాలు కూడా ఈసీఐ గణాంకాల్లో వెల్లడయ్యాయి.
2025–26 ఆర్థిక సంవత్సరంలో అన్నాడీఎంకేకు సుమారు రూ.161.35 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందాయి. ఇందులో టైగర్ అసోసియేట్స్ సంస్థ రూ.135 కోట్లు అందించి అతిపెద్ద దాతగా నిలిచింది. ఇక, డీఎంకే పార్టీకి రూ.191.19 కోట్ల విరాళాలు రాగా.. అందులో రూ.125 కోట్లు టైగర్ అసోసియేట్స్ సంస్థ నుంచే పార్టీ ఫండ్ కు చేరినట్లు ఈసీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
