సెల్ఫీ దిగుతుండగా కారును ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

సెల్ఫీ దిగుతుండగా కారును ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
  • ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్-వారణాసి హైవేపై ప్రమాదం

వారణాసి: ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆగి సెల్ఫీలు దిగుతున్న నలుగురు స్నేహితులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వారణాసిలోని శివపురి ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు మీర్జాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వింధ్యాచల ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. 

ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్- వారణాసి హైవేపై రూపాపూర్ సమీపంలోని ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి రాగానే తమ స్కార్పియో కారును పక్కన ఆపి సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. అదేసమయంలో ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో పాటు అక్కడే నిలబడి ఉన్న యువకులపైకి దూసుకెళ్లింది. 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను గ్యాస్ కట్టర్ సాయంతో బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.