ప్రయాణాల్లో గట్టిగా మాట్లాడితే ఫైన్... 6 నెలల జైలుశిక్ష కూడా.. దక్షిణ రైల్వే నిర్ణయం.. 

ప్రయాణాల్లో గట్టిగా మాట్లాడితే ఫైన్... 6 నెలల జైలుశిక్ష కూడా.. దక్షిణ రైల్వే నిర్ణయం.. 

చెన్నై: ప్రయాణికులకు ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు దక్షిణ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో పెద్దగా, గట్టిగా మాట్లాడటం, స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పాటలు లేదా వీడియోలు ప్లే చేయడంపై నిషేధం విధిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. 

ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 145 కింద రూ.1,000 వరకు జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈమేరకు దక్షిణ రైల్వే జోన్​పరిధిలోని చెన్నై, పాలక్కాడ్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, మధురై, సేలం డివిజన్ల అధికారులకు ఆదేశాలు అందాయి. 

ఈ విషయమై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రైల్వే స్టేషన్లలో హిందీ, ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రాంతీయ భాషల్లో అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు చేయాలని, నోటీసులు ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 
ప్రయాణ సమయంలో ఫోన్లలో మాట్లాడేటప్పుడు గొంతు తగ్గించాలని, పాటలు వినడానికి లేదా వీడియోలు చూడటానికి తప్పుకుండా 
ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్ వాడాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.