- ఎక్కడ చేసినా అదే పని కొంచం నిబద్ధత ఉండాలి
- ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి పంజాగుట్ట పీఎస్ తనిఖీ
పంజాగుట్ట, వెలుగు: ‘కొందరు నామ మాత్రంగా డ్యూటీలు చేస్తూ..ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడ చేసినా అదే ఉద్యోగం..ఎక్కడ పని చేస్తున్నా నిబద్ధతతో చేయాలి’ అంటూ ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి..పంజాగుట్ట పీఎస్‌లో సిబ్బందికి హితవు పలికారు. సోమవారం పంజాగుట్ట పీఎస్‌ను డీసీపీ తనిఖీ చేసిన సందర్భంగా కొందరు బదిలీ కోసం దరఖాస్తు చేశారని, ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అని నిర్లిప్తతో పని చేస్తున్నారని తెలిసి సుతిమెత్తగా మందలించారు.
మూడు గంటల పాటు ఏసీపీ మురళీకృష్ణ, సీఐ జహంగీర్‌యాదవ్, ఐదుగురు ఎస్ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించి సీసీ కెమెరాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు.
