గాల్లోనే ఎయిర్ అంబులెన్స్ డోర్ ఓపెన్..ఢాకాలో అత్యవసర ల్యాండింగ్

గాల్లోనే ఎయిర్ అంబులెన్స్ డోర్ ఓపెన్..ఢాకాలో అత్యవసర ల్యాండింగ్
  •     చికిత్స పొందుతూ మహిళ మృతి

ఢాకా: అనారోగ్యంతో ఉన్న భారతీయ మహిళ అంజనా భౌమిక్‌‌‌‌ (56)ను అగర్తలా నుంచి కోల్‌‌‌‌కతాకు ఎయిర్ అంబులెన్స్‌‌‌‌లో తరలిస్తుండగా సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం 12 వేల అడుగుల ఎత్తులో ఉండగా తలుపు పాక్షికంగా తెరుచుకుంది. దీంతో అప్రమత్తమైన పైలట్లు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మధ్యాహ్నం 1.40 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

వెంటనే అంజనాను అక్కడి స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం 4.40 గంటలకు  మృతి చెందారు. ఆమె మృతికి అనారోగ్య సమస్యలే కారణమా, విమానంలో చోటుచేసుకున్న ఘటన ప్రభావం ఏమైనా ఉందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. విమానంలో ఏడుగురు ఉండగా, మిగతా ఆరుగురు సురక్షితంగా ఉన్నారు. ముందస్తు అనుమతి లేకపోయినా బంగ్లాదేశ్ అధికారులు అత్యవసర ల్యాండింగ్‌‌‌‌కు అనుమతించారు. భారత హైకమిషన్ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నారు. ఎస్‌‌‌‌కేబీ ఇన్‌‌‌‌ఫ్రాకాన్ సంస్థకు చెందిన విమానం ప్రస్తుతం ఢాకా విమానాశ్రయంలోనే ఉంది.