కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలే.. ఆ ఇంటి సభ్యులు కోరుకుంటున్నరు: మహేష్ గౌడ్

కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలే.. ఆ ఇంటి సభ్యులు కోరుకుంటున్నరు: మహేష్ గౌడ్

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కోరుకోలేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయనే మరణం కోసం పూజలు చేస్తున్నారని ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత చెప్పారని గుర్తు చేశారు. బుధవారం (సెప్టెంబర్ 8) అసెంబ్లీ మీడియా పాయింట్‎లో మహేష్ మాట్లాడుతూ.. కేసీఆర్ చావు కోరుకుంటున్నామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 

వీర్లపల్లి శంకర్ సీఎం రేవంత్ రెడ్డి అభిమాని. బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్లు తిడుతున్నారన్న బాధలో శంకర్ అలా మాట్లాడారని వివరణ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం చెడిపోవాలని కోరుకునేది ఆయన ఇంటి సభ్యులేనని అన్నారు. 

►ALSO READ | గుర్తుంచుకో రేవంత్.. BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్‎పై హరీష్ రావు రియాక్షన్

కేసీఆర్ ఫామ్ హౌస్‎లో గాయపడితే గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి తరలించామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‎ను పరామర్శించారన్నారు. ప్రతిపక్ష నాయకులకు గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ తర్వాత అంతటి భద్రత కేసీఆర్‎కే కల్పించామన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కూడా వందల సంఖ్యలో పోలీసులను మోహరించారని చెప్పారు.