పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల గడువు పొడిగింపు.

పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల గడువు పొడిగింపు.

పోలీస్ శాఖలో పలు  పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తుల గడువును పొడిగించారు. అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

పోలీస్ శాఖలో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఎస్‌ఐ సివిల్, ఏఎస్ఐ, ఫింగర్‌ప్రింట్ బ్యూరో, కానిస్టేబుల్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఇప్పటివరకు 3లక్షల38 వేల 336 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. వీరిలో 2లక్షల 88వేల 530 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. అలాగే 2 లక్షల76 వేల 85 మంది అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను పూర్తిగా సమర్పించారు.

ALSO READ : డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో మేనేజర్ పోస్టులు.. 

అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ 95 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.  మహిళలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించింది. ఎస్‌పీఎఫ్, ఫైర్ సర్వీసెస్ పోస్టుల్లో 33.3 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు పేర్కొన్నారు.

దరఖాస్తు గడువు పొడిగించినప్పటికీ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అభ్యర్థులకు సూచించింది. చివరి రోజుల్లో సర్వర్‌పై అధిక భారం కారణంగా సాంకేతిక సమస్యలు, సర్వర్ రద్దీ, దరఖాస్తు సమర్పణలో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.