హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తుండగా శాంతి భద్రతల సమస్య దృష్ట్యా హాకీంపేట్ దగ్గర పోలీసులు వీరిని అడ్డుకున్నారు. మా పార్టీ అధినేత దగ్గరకు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు.
పోలీసులు కార్లను అడ్డుకోవడంతో కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫామ్ హౌస్ వైపు కదిలారు. పోలీసులు మళ్లీ అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ను బోయినపల్లి స్టేషన్‌కు, హరీష్ రావును జవహర్ నగర్ పీఎస్‌కు తరలించారు.
►ALSO READ | చిల్లర నా కొ.. బూతులతో రెచ్చిపోయిన KTR బూతులు
మరోవైపు.. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. దీంతో ఎర్రవల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఎర్రవల్లిలో భారీగా బలగాలను మోహరించి.. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలతో ఎర్రవల్లి రణరంగంగా మారింది.
