వరుసగా మూడు రోజులు హాలిడేస్.. బ్యాంక్స్, ఆఫీసులు కూడా బంద్..

వరుసగా మూడు రోజులు హాలిడేస్.. బ్యాంక్స్, ఆఫీసులు కూడా బంద్..

ఈ సెప్టెంబర్ నెల రెండో వారంలో విద్యార్థులకు వరుస  సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే వారికి  మంచి లాంగ్ వీకెండ్ దొరకనుంది. కానీ సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, విద్యాసంస్థలు ఎప్పటిలాగే పని చేస్తాయి.  అయితే  ఈ ఐదు రోజులు  తర్వాత మాత్రం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రాబోతున్నాయి.

సెప్టెంబర్ 12 (రెండో శనివారం): ఈ రోజు రెండో శనివారం కావడంతో చాలా స్కూళ్లకు సెలవు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు చాలా వరకు సెలవు ఉండే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 13 (ఆదివారం): వీకెండ్ హాలిడే. స్కూల్స్, కాలెజ్స్, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు బంద్. 

సెప్టెంబర్ 14 (వినాయక చవితి):  వినాయక చవితి పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు రానుంది.  తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలకు (గెజిటెడ్) సెలవు ఉండే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, ఉత్తరాదిలోని రాజస్థాన్‌ జైపూర్‌లో సెప్టెంబర్ 11న మున్సిపల్ ఎన్నికల కారణంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అయితే బ్యాంకులకు ఇచ్చే సెలవులు వేరు, స్కూళ్లకు వర్తించే సెలవులు వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్థానిక విద్యాశాఖ లేదా మీ పిల్లల స్కూల్ యాజమాన్యం ఇచ్చే అధికారిక ప్రకటన బట్టే సెలవులు ఆధారపడి ఉంటాయి. 

►ALSO READ | సంతాన వ్రతం: ఆడపిల్లలు కావలా.. మగపిల్లలు కావాలా..చేయాల్సినపూజ.. నైవేద్యాలు ఇవే..!

మొత్తంగా చూస్తే సెప్టెంబర్ రెండో వారంలో వీకెండ్ తో పాటు  వినాయక చవితి పండుగ కూడా కలిసి రావడంతో, వరుసగా మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు బంద్‌ కానున్నాయి.