పలమనేరులో దారుణం.. నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నేతల దాడి

పలమనేరులో దారుణం.. నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నేతల దాడి

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. లేటెస్టుగా పలమనేరులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నేతలు దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. 2026 అక్టోబర్ 24న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్వగ్రామం కెలావతిలో జరిగిన దాడికి సంబంధించిన వీడియో చర్చనీయాంశంగా మారింది. 

కెలవాతి ఎంపీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులుపై టీడీపీ నేత సుబ్రమణ్యం దాడి చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. 

ALSO READ : హైదరాబాద్లో డిసెంబర్ 15 నుంచి నీటి తిప్పలు..

టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేద‌ని ఆవేద‌న‌ వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.