స్థానిక ఎన్నికల వేళ రాజకీయ కక్షలతో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ, వైసీపీ మధ్య బహిరంగ దాడులు కొనసాగుతున్నాయి. ఒక యువరైతు చెరుకు తోట ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిత్తూరు జిల్లాలో ఎంటెక్ చేసి వ్యవసాయం చేసుకుంటున్న యువరైతుపై టీడీపీ నేతలు కక్ష సాధింపులకు దిగుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోతకు వచ్చిన చెరుకు పంటను జేసీబీతో ధ్వంసం చేసినట్లు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే పరస్పర దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో చెరుకు తోట ధ్వంసం చేసిన వీడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది పాత వీడియో కొందరు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తెకు పోటీగా నామినేషన్ వేసినందుకే రాజకీయ కక్షతో తన చెరుకు తోటను ధ్వంసం చేశారని యువ రైతు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. #ChintamaneniPrabhakar #TDP #AndhraPolitics #FarmersIssues https://t.co/2lQZXgXTad
— AffiresAP (@AffiresAP) October 24, 2026
