గవర్నర్‏తో BRS ఎమ్మెల్యేల బృందం భేటీ.. మహిళా ఎమ్మెల్యేల ఇష్యూపై కంప్లైంట్

గవర్నర్‏తో BRS ఎమ్మెల్యేల బృందం భేటీ.. మహిళా ఎమ్మెల్యేల ఇష్యూపై కంప్లైంట్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. బుధవారం (సెప్టెంబర్ 9) మధ్యాహ్నం లోక్ భవన్‎కు వెళ్లిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్‎ను కలిశారు. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీలపై పోలీసుల అనుచిత ప్రవర్తనకు నిరసనగా గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకున్న అంశాన్ని కూడా గవర్నర్ దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. 

కాగా, తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజు అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. స్లోగన్స్ రాసి ఉన్న నలుపు రంగు టీషర్టులు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా వస్త్రధారణతో వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ఆదేశాల మేరకు పోలీసులు అసెంబ్లీ గేట్ దగ్గర అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహానికి లోనై పోలీసులపైకి దూసుకెళ్లారు.

►ALSO READ | కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలే.. ఆ ఇంటి సభ్యులు కోరుకుంటున్నరు: మహేష్ గౌడ్

పోలీసుల కాలర్ పట్టుకుని దాడి చేశారు. హరీష్ రావుతో పాటు కొందరు ఎమ్మెల్యేలు మహిళాల పోలీసుల ముందే టీషర్టులు విప్పారు. అయితే, కొందరు పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఆరోపించారు. పోలీసులు తన చీర లాగారని ఎమ్మెల్యే సునీతా రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి పోలీసుల తన గొంతు నొక్కారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు తీరుపై బీఆర్ఎస్ గవర్నర్‎కు ఫిర్యాదు చేసింది.