హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో క్లౌడ్ నైన్ హుక్కా సెంటర్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు పోలీసులు. బుధవారం ( సెప్టెంబర్ 9 ) నిర్వహించిన ఈ దాడుల్లో నిషేధిత పొగాకు, హుక్కా ఫ్లేవర్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
గచ్చిబౌలి డిఎల్ఎఫ్ రోడ్ లోని క్లౌడ్ నైన్ హుక్కా సేంటర్ లో నిషేధిత పోగాకు, హుక్కా ప్లేవర్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. హుక్కా సెంటర్ లో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. అయితే. యువకుల దగ్గర ఎటువంటి గంజాయి కానీ, డ్రగ్స్ కానీ దొరకలేదని స్పష్టం చేశారు అధికారులు.
డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా బెంగుళూరుకు చెందిన బిజూ మ్యాథ్యు అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలిందని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు.పరారీలో ఉన్న హుక్కా సెంటర్ నిర్వాహకుడు రమేష్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
