పెరిగిన ఇంటి భోజనం తయారీ ఖర్చు.. వెజ్, నాన్ వెజ్ ఎంత పెరిగిందంటే..?

పెరిగిన ఇంటి భోజనం తయారీ ఖర్చు.. వెజ్, నాన్ వెజ్ ఎంత పెరిగిందంటే..?

న్యూఢిల్లీ: ఇంట్లో వండిన భోజనం తయారీ ఖర్చు గత నెలలో మోస్తరుగా పెరిగిందని మార్కెట్ రీసెర్చ్​ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. దీని రిపోర్ట్​ ప్రకారం.. శాకాహారం ధర సంవత్సరం ప్రాతిపదికన ఒక శాతం పెరిగి రూ.29.50కు చేరింది. బియ్యం, వంట నూనెలు, గ్యాస్​ధరలు అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. బాయిలర్ కోళ్ల ధరలు 10 శాతం పెరిగాయి. దీంతో మాంసాహార భోజనం ధర ఐదు శాతం పెరిగి రూ.57.50 అయింది.  

అయితే జూలై నెలలో రూ.58.3 ఉన్న ధరతో పోలిస్తే ఒక శాతం తగ్గింది. అసాధారణ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గడంతో ఉల్లి ధర 43 శాతం ఎగబాకి కేజీ రూ.40 అయింది. వంటనూనెల ధర11 శాతం, ఎల్పీజీ ధర 10 శాతం పెరిగాయి. బంగాళాదుంప ధరలు 12 శాతం, టమాటా ధరలు 28 శాతం క్షీణించడం వల్ల కొంత ఉపశమనం లభించిందని క్రిసిల్​ రిపోర్ట్​ వివరించింది.