ప్రతిపక్ష నేత చావాలని కోరుకోవడమేంటి?..వీర్లపల్లి శంకర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లే: కవిత

ప్రతిపక్ష నేత చావాలని కోరుకోవడమేంటి?..వీర్లపల్లి శంకర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లే: కవిత

హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప చావు కోరుకోవడమేంటని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్​ కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం ఇదే మొదటిసారి కాదని విమర్శించారు. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్  ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్  చావు కోరుకుంటున్నట్టు వీర్లపల్లి శంకర్​ చేసిన వ్యాఖ్యలపై కవిత మంగళవారం ఎక్స్​లో స్పందించారు.

కేసీఆర్​ పేరును ప్రస్తావించకుండానే ఆమె రెస్పాండ్​అయ్యారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను ఇలాంటి దాడికి ఉసిగొల్పడం దారుణమన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండు రోజులు విలువైన సభా సమయాన్ని వృథా చేశాయి’. అని ఆమె విమర్శించారు. 

పోలీస్​ జాబ్స్​కు ఏజ్​ పెంచాలె

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నిరుద్యోగులేనని, ఊరూరా తిరిగి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చేలా చేశారని కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్​ ఆఫీసులో కవితతో కానిస్టేబుల్  అభ్యర్థులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా జాబ్  నోటిఫికేషన్లు వేయడం లేదన్నారు. 2024లో కానిస్టేబుల్  పోస్టులకు నోటిఫికేషన్  వేస్తున్నట్టు ప్రచారం చేసుకొని జీవో నంబర్ 31 విడుదల చేశారని, ఏజ్​ రిలాక్సేషన్ ఇస్తామని చెప్పి రెండేళ్లు వేస్ట్​ చేశారని విమర్శించారు. దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులు వయోపరిమితి మించి పోయి అర్హత కోల్పోయారన్నారు. ఎస్సై, కానిస్టేబుల్  ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి పెంచాలని డిమాండ్​ చేశారు.