బీఆర్ఎస్ పార్టీది నీచాతి నీచమైన సంస్కృతి: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్

బీఆర్ఎస్ పార్టీది నీచాతి నీచమైన సంస్కృతి: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో 22ఏపై చర్చకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా 15, 20 నిమిషాల పాటు ఇవ్వాల్సిన బ్రేక్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెండు, మూడు గంటల పాటు ఇస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీది నీచాతి నీచమైన సంస్కృతి అంటూ ఫైర్ అయ్యారు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2:50 గంటలకు అసెంబ్లీలో సెషన్ ప్రారంభమైంది.

ప్యానల్ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కులం పేరుతో దూషించిన సంఘటనపై ఎమ్మెల్యేల స్పీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు 22ఏకు సంబంధించిన ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపారు. ఆ సమయంలో తమకు మాట్లాడడానికి అనుమతించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరారు.

అసెంబ్లీ జరుగుతున్న సమయంలో 15, 20 నిమిషాల పాటు ఇవ్వాల్సిన బ్రేక్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెండు, మూడు గంటలు ఇవ్వడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐదు రోజుల పాటు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఇలా టైమంతా బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకే పోతే ఎట్లా? అని ప్రశ్నించారు. 22ఏ అంశం కాకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ విషయంపై మాట్లాడటానికి కొద్ది నిమిషాల పాటు అనుమతించారు. ఈ విషయంపై తమ పార్టీ వైఖరిని సోమవారమే చెప్పామని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, అతని తల్లిని అవమానించడాన్ని తప్పు పట్టిన ఆయన బీఆర్ఎస్ నీచాతి నీచమైన పార్టీ అని విమర్శించారు. వాళ్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా తమ పార్టీ సహకరిస్తుందని చెప్పారు. 22ఏపై చర్చించడానికి అనుమతి ఇవ్వకపోవడంతో తాము వాకౌట్ చేస్తున్నామని మహేశ్వర్ రెడ్డి ప్రకటించగా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ హాల్ విడిచి బయటికి వెళ్లిపోయారు.